నాలుగేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో నటుడు జయచంద్రన్‌పై లుక్ అవుట్ నోటీసు
- బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు
- ముందస్తు బెయిలు నిరాకరించిన కేరళ హైకోర్టు
- నటుడిపై చర్యలకు బాధిత కుటుంబ సభ్యుల ఒత్తిడి
ఈ కేసులో జయచంద్రన్ ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించగా కేరళ హైకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అంతకుముందు కోజికోడ్ సెషన్స్ కోర్టు కూడా బెయిలు నిరాకరించింది. దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు కసబ పోలీసులకు సమాచారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.