Viral News: ఎక్కువ సమయం శ్రమించే ఉద్యోగులు ఉన్న టాప్10 దేశాలు ఇవే
- వారానికి సగటున 54.4 గంటలు పనిచేస్తూ అగ్రస్థానంలో నిలిచిన భూటాన్ ఉద్యోగులు
- 50.9 పని గంటలతో రెండో స్థానంలో నిలిచిన యూఏఈ
- సగటున 46.7 గంటలు శ్రమిస్తూ 13వ స్థానంలో నిలిచిన భారతీయ ఎంప్లాయీస్
దేశీయ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ... ఈ పోటీతత్వ ప్రపంచంలో ఉద్యోగులు వారానికి 90 గంటల వరకు పని చేయాలని సూచించారు. ఆదివారాలు కూడా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, షాదీ.కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్‌తో పాటు పలువురు భారతీయ వ్యాపార ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో, సుదీర్ఘ పని గంటలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్న దేశాల జాబితాను అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. భారతీయ ఉద్యోగులు ప్రతి వారం సగటున 46.7 గంటలు పనిచేస్తున్నారని తెలిపింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు వారంలో 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తారని పేర్కొంది.
టాప్- 10 దేశాలు ఇవే
1. తక్కువ జనాభా ఉన్నప్పటికీ భూటాన్ ఉద్యోగులు ప్రపంచంలో అత్యధిక పని గంటలు శ్రమిస్తున్నవారిగా నిలిచారు. ఆ దేశంలోని ఉద్యోగులు వారానికి దాదాపు 54.4 గంటలు పని చేస్తున్నారు.
2. యూఏఈలోని ఉద్యోగులు వారానికి 50.9 గంటలు పనిచేస్తూ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
3. దక్షణ ఆఫ్రికా ఖండంలోని లెసోతో దేశ ఉద్యోగులు ప్రతి వారం 50.4 గంటలు పని చేస్తారు.
4. ఈ జాబితాలో కాంగో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఉద్యోగులు వారానికి 48.6 గంటలు శ్రమిస్తున్నారు.
5. వారానికి సగటున 48 గంటలు కష్టపడే ఉద్యోగులు ఉన్న ఖతార్ 5వ స్థానంలో నిలిచింది.
6. లైబీరియా 6వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు వారానికి 47.7 గంటలు పని చేస్తారు.
7. ఆఫ్రికా ఖండంలోని మౌరిటానియా దేశంలో 7వ స్థానంలో నిలిచింది. ఇక్కడి ఉద్యోగులు వారానికి 47.6 గంటలు చేస్తున్నారు.
8. లెబనాన్ 8వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు వారంలో సగటున 47.6 గంటలు కష్టపడుతున్నారు.
9. మంగోలియాలో 9వ స్థానంలో నిలిచింది. ఇక్కడి ఉద్యోగులు వారానికి 47.3 గంటలు శ్రమిస్తున్నారు.
10. ఈ జాబితాలో జోర్డాన్ పదవ స్థానంలో నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు వారానికి సగటున 47 గంటలు పనిచేస్తున్నారని ఐఎల్‌వో నివేదిక పేర్కొంది.
ఇక ఉద్యోగుల అత్యుల్ప గంటల పనిచేసే దేశాల విషయానికి వస్తే... దక్షిణ పసిఫిక్ దేశమైన వనౌటు అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి ఉద్యోగులు వారానికి సగటున 24.7 గంటలు మాత్రమే పని చేస్తారు. కిరిబాటి (27.3 గంటలు), మైక్రోనేషియా (30.4 గంటలు) ఆ తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి.