మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌కు పరామర్శ
- సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్
- కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
- హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
‘పుష్ప-2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‌ను ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తనవంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి చేరుకుని శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు.