స్టీవ్ స్మిత్ స్లెడ్జింగ్.. ఆ తర్వాతి బంతికే వికెట్ పారేసుకున్న గిల్.. వైరల్ వీడియో!
నాథన్ లైయన్ బౌలింగ్‌లో గిల్‌పై స్లెడ్జింగ్‌కి పాల్పడ్డాడు. లబుషేన్, లైయన్‌తో కలిసి భారత బ్యాటర్ దృష్టిని మరలించాడు స్మిత్. అంతే.. మనోడు ఆ తర్వాతి బంతికే క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడాడు. దాంతో బాల్.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా స్లిప్‌లో ఉన్న స్మిత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. గిల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్న స్మిత్ తోటి ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.