వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ బిల్లులపై సందిగ్ధత... రేపటి లిస్టు నుంచి తొలగింపు!

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ బిల్లులపై సందిగ్ధత... రేపటి లిస్టు నుంచి తొలగింపు!

new updated Parliament business list has no mention of One Nation One Election bills
  • సోమవారం లోక్‌సభ బిజినెస్ అజెండాలో కనిపించని బిల్లులు
  • మోదీ సర్కారు ఊహించని నిర్ణయం 
  • ప్రస్తుత సమావేశాలకు మరో నాలుగు రోజులే సమయం
ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో సోమవారం (డిసెంబర్ 16) ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. లోక్‌సభ సోమవారం బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను తొలగించింది. ఈ మేరకు అప్‌డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లులు కనిపించడం లేదు. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది. 

కాగా, ఈ బిల్లులను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సోమవారం సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది. అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది. అంతలోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ బిల్లులను తిరిగి ఎప్పుడు సభలో ప్రవేశపెడతారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. డిసెంబర్ 20తో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. సోమవారాన్ని మినహాయిస్తే మరో నాలుగు రోజులే మిగిలి ఉంటాయి. మరి ఈ సెషన్‌లోనే సభ ముందుకు బిల్లులను తీసుకొస్తారా... లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Advertisement
One Nation One Election
Parliament
Lok Sabha
BJP

More Telugu News