Amazon: అమెజాన్‌లో తెలంగాణ యువ‌కుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో జాబ్‌!

Telangana Man got Job with Rs 2 Crore Package in Amazon
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌లో తెలంగాణ యువ‌కుడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.2 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. వివ‌రాల్లోకి వెళితే.. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండ‌లం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ ఇలా అమెజాన్‌లో అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. అమెజాన్‌లో అప్లైడ్ సైంటిస్ట్‌గా రూ.2కోట్ల వార్షిక వేత‌నంతో జాబ్ సాధించి వార్త‌ల్లో నిలిచాడు. ఈరోజే విధుల్లో చేర‌నున్నాడు. 

అర్బాజ్ ఖురేషీ 2019లో పాట్నా ఐఐటీ నుంచి కంప్యూట‌ర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అయితే, బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్‌లో ఉండ‌గా ఫ్రాన్స్‌కి చెందిన ప్ర‌ముఖ మెషిన్ లెర్నింగ్ నిష్ణాతుడు గేల్ డ‌యాస్ వ‌ద్ద మూడు నెల‌ల పాటు ఇంట‌ర్న్‌షిప్ చేశాడు. బీటెక్ పూర్త‌యిన త‌ర్వాత బెంగ‌ళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో రెండేళ్లు ప‌నిచేశాడు. అనంత‌రం గ‌తేడాది అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ఎంఎస్ ప‌ట్టా అందుకున్నాడు. ఇక త‌న‌ కుమారుడికి అమెజాన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు దొర‌క‌డం ప‌ట్ల తండ్రి యాసిన్ ఖురేషీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఎక్సైజ్ జాయింట్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.   
Go Back to Shorts
Amazon
Telangana
Arbaj Khureshi
Job

More Telugu News