సిరియా అధ్యక్షుడు అసద్ విమానం కూల్చివేత!
- దేశం విడిచి పారిపోతుండగా విమానం కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- అసద్ విమానం ఒక్కసారిగా కిందకి పడిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ల ద్వారా వెల్లడి
- లెబనాన్ పరిధిలో విమానం నేలకూలినట్లు ఈజిప్ట్ రచయిత ట్వీట్
లెబనాన్ గగనతలంలో 3,650 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా 1,070 మీటర్ల ఎత్తుకు పడిపోయిందని మహమూద్ చెప్పారు. ఆ తర్వాత విమానం ఆచూకీ రాడార్ కు అందలేదని వివరించారు. విమానం ఎకాఎకిన అంత కిందకు దిగడం, ఆ తర్వాత రాడార్ మీద కనిపించకుండా పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐఎల్ -76 ను ఎవరైనా కూల్చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అసద్ విమానం కూలిందని చెబుతున్న ఏరియా లెబనాన్ పరిధిలో ఉంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.