Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా?

Junior NTR and Prashanth Neel film title is Dragon
షార్ట్స్‌లో చూడండి
'దేవర' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం హిందీ చిత్రం 'వార్ 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ లో తారక్ జాయిన్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. 

ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు చెపుతున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలు కానున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Junior NTR
Prashanth Neel
Dragon
Tollywood

More Telugu News