పార్టీలో సమంత డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియోపై సినీ ప్రముఖుల ప్రశంసలు.. వీడియో ఇదిగో!

Samantha Dance For Nain Matakka Goes Viral
  • పార్టీ ఇచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ టీం
  • ‘బేబీ జాన్’లోని ’నైన్ మటక్కా’ సాంగ్‌కు వరుణ్ ధావన్‌తో కలిసి సమంత డ్యాన్స్
  • పార్టీ ఫొటోలను షేర్ చేసిన సమంత
బాలీవుడ్ నటుడు వరుణ ధావన్ రాబోయే సినిమా ‘బేబీ జాన్’ నుంచి ఇటీవల విడుదలై దుమ్ము రేపుతున్న ‘నైన్ మటక్కా’ సాంగ్‌కు సమంత, వరుణ్ ధావన్ వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారి స్టెప్పులకు ఫిదా అయిన సినీ ప్రముఖులు ఆ వీడియోను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సమంత, వరుణ్ ధావన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ నుంచి ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఇచ్చిన పార్టీలో సమంత, వరుణ్ ఇలా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఈ పార్టీ ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ‘అందమైన వ్యక్తులతో గడిపిన అందమైన సాయంత్రం.. నా మనసంతా ఆనందం, కృతజ్ఞతతో నిండిపోయింది’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ తగిలించింది. సమంత పోస్టుకు వరుణ్ ధావన్.. ‘ఎప్పటికీ ది బెస్ట్ కో స్టార్’ అంటూ రిప్లై ఇచ్చాడు. 
Go Back to Shorts
Samantha
Varun Dhawan
Citadel
Viral Video
Nain Matakka Song

More Telugu News