జైనబ్ మంచి అమ్మాయి.. అఖిల్ జీవితాన్ని పరిపూర్ణం చేయగలదు: నాగార్జున

Jainab Ravdjee is a good girl says Nagarjuna
  • తమ కుటుంబంలో వరుస పెళ్లి వేడుకలు జరగనుండటం సంతోషంగా ఉందన్న నాగార్జున
  • చైతూ పెళ్లిని తక్కువ మంది అతిథుల సమక్షంలో చేయాలనుకుంటున్నామని వెల్లడి
  • వచ్చే ఏడాది అఖిల్-జైనబ్ ల పెళ్లి జరుగుతుందన్న నాగ్
అక్కినేని వారి ఇంట వరుస వివాహ వేడుకలు జరగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం శోభితతో డిసెంబర్ 4న జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి పనులు శరవేగంగా జరగనున్నాయి. 

మరోవైపు నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. జైనబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున మాట్లాడుతూ... తమ కుటుంబంలో వరుస పెళ్లి వేడుకలు జరగనుండటం సంతోషంగా ఉందని అన్నారు. తమ కుటుంబం పెద్దదని, శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదేనని చెప్పారు. కుటుంబ సభ్యులు, తక్కువ మంది అతిథుల సమక్షంలో గ్రాండ్ గా వివాహ వేడుకను నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. 

అఖిల్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని నాగార్జున చెప్పారు. జైనబ్ చాలా మంచి అమ్మాయని అన్నారు. అఖిల్ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదని చెప్పారు. తమ కుటుంబంలోకి జైనబ్ ను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది అఖిల్-జైనబ్ వివాహం జరుగుతుందని వెల్లడించారు.
Advertisement
Nagarjuna
Tollywood
Akkineni Akhil
Naga Chaitanya

More Telugu News