ఇండియా ఆలౌట్... బుమ్రా దెబ్బకు విలవిల్లాడుతున్న ఆస్ట్రేలియా

Team India all out for 150 runs
  • 150 పరుగులకు ఇండియా ఆలౌట్
  • 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన నితీశ్ రెడ్డి
  • 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. నితీశ్ రెడ్డి (41), రిషభ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) మినహా మరెవరూ రాణించలేదు. 49.4 ఓవర్లకు ఇండియా ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తీయగా.. స్టార్క్, మిచెల్ మార్ష్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా తడబడుతోంది. 31 పరుగులకే ఆసీస్ 4 వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా (8), మెక్ స్వీనీ (10), స్మిత్ (0) పెవిలియన్ చేరారు. వీరు ముగ్గురినీ బుమ్రా ఔట్ చేశాడు. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను కొత్త బౌలర్ హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 33 పరుగులు. లబుషేన్ (1 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Advertisement
Team India
Australia
Test Match

More Telugu News