Ramcharan: ఏఆర్‌ రెహమాన్‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రామ్ చ‌ర‌ణ్!

Ram Charan kept his promise to AR Rahman
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం కథానాయకుడు రామ్‌ చరణ్‌  'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం ప్రమోషన్‌ వర్క్‌లో ఉన్నాడు. దీంతో పాటు చరణ్‌ తన తదుపరి చిత్రం చిత్రీకరణకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుంచి మైసూర్‌లో ఆయన తాజా చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా గతంలో రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం రామ్‌చరణ్‌ సోమవారం కడప దర్గాను సందర్శించాడు. ఈ మేరకు ఆయన కడప దర్గాలో జరిగిన 80 వ జాతీయ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాకు రెహమాన్‌ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జరిగే ముషాయిరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ ను తీసుకొస్తానని ఆయన అక్కడి వాళ్లకు మాటిచ్చారట. 

ఈ నేపథ్యంలో ఏఆర్‌ రెహమాన్‌ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్‌, మరో వైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రామ్‌చరణ్‌తో పాటు బుచ్చిబాబు కూడా దర్గాను సందర్శించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘ ఏఆర్‌ రెహమాన్‌ మూడు నెలల ముందే ఈ కార్యక్రమం గురించి చెప్పారు. ఆయనతో వస్తానని చెప్పడంతో ఆయన కోసం నేను అయ్యప్ప మాలలో ఉన్నా ఈ రోజు ఇక్కడికి వచ్చాను.  

కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ ద‌ర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే, నా కెరీర్‌లో అతి ముఖ్యమైన సినిమాగా భావించే 'మ‌గ‌ధీర' సినిమా విడుదలకు ముందు రోజు నేను ఈ ద‌ర్గాకు వచ్చాను. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందీ, నా కెరీర్‌కు ఎంతటి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందీ తెలిసిందే. మళ్లీ ఈ రోజు నేను  ఇక్క‌డ‌కు రావ‌టం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.

.
Go Back to Shorts
Ramcharan
BuchiBabu Sana
Kadapa Dargah
RC 16
Ram charan
Cinema
Telugu cinema

More Telugu News