అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా?

అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా?

Do you know mukesh ambani driver salary
  • అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అంబానీ
  • ఆయన వాహనాలన్నీ లగ్జరీ, బుల్లెట్‌ ప్రూఫ్‌ సహితం
  • వాటిని సమర్థవంతంగా నడపగలిగే వ్యక్తికే డ్రైవర్‌ బాధ్యతలు
  • వారికి మిలటరీ స్థాయిలో డ్రైవింగ్‌ నైపుణ్యం... భద్రతపై శిక్షణ
మన దేశ కుబేరుడు ముఖేశ్‌ అంబానీ... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఏకంగా రూ.4 వేల కోట్లకుపైగా విలువైన ఇల్లు, లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతం. ఆయన ఎక్కడికి వెళ్లినా కట్టుదిట్టమైన భద్రత. మరి అలాంటి ముఖేశ్‌ అంబానీ కారు నడిపే డ్రైవర్‌ జీతం ఎంతో తెలుసా? నిజానికి ఈ వివరాలు రహస్యంగా ఉంటాయి. కానీ జాతీయ ఆంగ్ల మీడియా వివిధ మార్గాల్లో వివరాలను సేకరించి వెల్లడిస్తుంటుంది. ఆ కథనాల ప్రకారం... 

లక్షల కోట్ల ఆస్తులతో...
ముఖేశ్‌ అంబానీ సంపద 2014 అక్టోబర్‌ 20వ తేదీ నాటికి సుమారు 8.5 లక్షల కోట్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఆయన 17వ స్థానంలో ఉన్నారు. మరి ఆయన కారు నడిపే డ్రైవర్‌ జీతం ఎంత అంటారా? 2017 నాటి లెక్కల ప్రకారం, అంటే ఏడేళ్ల కిందట నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ.24 లక్షలు వేతనంగా చెల్లించారు. అదే ఇప్పుడు సుమారు ఇంతకు రెండింతల వరకు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది. అంటే సుమారు నెలకు రూ.4 లక్షల వరకు, ఏడాది మొత్తంగా చూస్తే 48 లక్షల వరకు జీతం అందుతుందన్న మాట.

కేవలం డ్రైవింగ్‌ కోసమే అంత జీతమా?
  • దేశంలోని అత్యంత ముఖ్యమైన, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే వ్యక్తి ముఖేశ్‌ అంబానీ. ఆయన కారును నడిపే వ్యక్తి... అంబానీకి అన్ని రకాలుగా భద్రత కల్పించేవారిగా ఉండేలా చూస్తారు.
  • సదరు డ్రైవర్‌ కు మిలటరీ స్థాయిలో డ్రైవింగ్‌ నైపుణ్యాలపై శిక్షణ ఉంటుంది. ఒక సైనికుడి తరహాలో ఫిట్‌ నెస్‌ ఉండాలి.
  • అత్యంత విలాసవంతమైన, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను వారు నడపాల్సి ఉంటుంది.
  • అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు అడ్డుపెట్టి అయినా తన యజమానిని రక్షించే సామర్థ్యం కూడా ఉండాలి.
  • ఇందుకోసం సదరు వ్యక్తుల నేపథ్యం, ప్రవృత్తి వంటివన్నీ పరిశీలించి.. అన్నిరకాలుగా పరీక్షించి డ్రైవర్‌ గా డ్యూటీలోకి తీసుకుంటారు.
  • ఈ అంశాల కారణంగానే.. సదరు డ్రైవర్లకు భారీ స్థాయిలో వేతనాలు చెల్లిస్తుంటారు.
Advertisement
Mukesh Ambani
Driver salary
offbeat
india
Car
military
Vip security

More Telugu News