ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్‌కు ఒంగోలు పోలీసులు

Ongole Police Notices to Ram Gopal Varma
  • చంద్ర‌బాబు, ప‌వ‌న్‌పై అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు
  • ప్ర‌కాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో ఆర్‌జీవీపై కేసు న‌మోదు
  • ఈ కేసులో విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు సిద్ధం చేసిన పోలీసులు
  • వ్య‌క్తిగ‌తంగా ఆ నోటీసులు ఆర్‌జీవికి ఇచ్చేందుకు హైద‌రాబాద్‌కు ఒంగోలు పోలీసులు
ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. ఎస్ఐ శివ‌రామ‌య్య ఆధ్వ‌ర్యంలోని బృందం ఇవాళ ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్ ధ్రువీక‌రించారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో ఆర్‌జీవీ.. అప్ప‌టి ప్ర‌తి ప‌క్ష‌నేత, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వాల‌ను కించ‌ప‌రిచేలా ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్టులు పెట్టారంటూ ప్ర‌కాశం జిల్లా ‌మద్దిపాడు పీఎస్‌లో కేసు న‌మోదైంది. 

ఈ కేసులో భాగంగా విచార‌ణ‌కు హాజరు కావాల‌ని ఆయ‌న‌కు నోటీసులు రెడీ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఒంగోలు పోలీసులు వ్య‌క్తిగ‌తంగా ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్ రావ‌డం జ‌రుగుతోంది.   
Go Back to Shorts
Ram Gopal Varma
Ongole Police
Notices
Andhra Pradesh
Social Media

More Telugu News