నిజజీవితంలో 'అమ్మ' పాత్రపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇప్పటికీ అమ్మనవ్వాలని కలలు కంటున్నానన్న అగ్రనటి
- తల్లిగా ఉండడానికి ఇష్టపడతానని వ్యాఖ్య
- తల్లిని కావడం ఆలస్యమైందని భావించడం లేదని వెల్లడి
కాగా సమంత - నాగచైతన్య పెళ్లి 2017లో జరిగింది. అయితే 2021లో వీరు విడిపోయారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం అయింది. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేడుక జరగనుంది.
‘ఇక, సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ నవంబర్ 7న విడుదలైంది. సమంతతో పాటు వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించాడు.