సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో కేటీఆర్ సందడి... ఇవిగో వీడియోలు

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో కేటీఆర్ సందడి... ఇవిగో వీడియోలు

KTR take lunch in Paradise hotel
  • పార్టీ నాయకులతో కలిసి ప్యారడైజ్ హోటల్‌కు వెళ్లిన కేటీఆర్
  • అందరితో కలిసి బిర్యానీ ఆరగించిన కేటీఆర్
  • వెయిటర్‌ను పిలిచి... పక్కన కూర్చోబెట్టుకొని ఫొటో దిగిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో సందడి చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నాలో పాల్గొన్న అనంతరం మరికొందరు నేతలతో కలిసి కేటీఆర్ ప్యారడైజ్ హోటల్‌కు వెళ్లారు. ప్యారడైజ్ హోటల్లో హోటల్‌కు వచ్చే అందరిలాగా ఆయన టేబుల్‌పై కూర్చున్నారు. తోటి నాయకులతో కలిసి బిర్యానీ తిన్నారు.

ఈ సమయంలో ఆయనను పలకరించేందుకు చాలామంది ఆసక్తి కనబరిచారు. కొందరు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. భోజనం చేసి తిరిగి వెళ్తున్నవారు... అటువైపు నుంచి లోనికి వెళ్తున్నవారు కేటీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదిలారు. హోటల్‌లో పని చేసే ఓ వెయిటర్‌ను పక్కన కూర్చోబెట్టుకొని ఆయనతో ఫొటో దిగారు. 
Advertisement
KTR
Hyderabad
BRS
Hotel

More Telugu News