Advertisement

రాజ్ పాకాలను వెనుకేసుకు రావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి: అనిల్ యాదవ్

Anil Yadav fires at KTR for supporting Raj Pakala
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్న కాంగ్రెస్ ఎంపీ
  • జన్వాడ ఫాంహౌస్ ఎప్పుడూ వివాదాలకు కేంద్రంగా ఉంటోందని ఆగ్రహం
  • గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రగ్స్ కేసును తప్పుదారి పట్టించిందని విమర్శ
తన బావమరిది రాజ్ పాకాల, సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరిని వెనుకేసుకురావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదని విమర్శించారు.

జన్వాడ ఫాంహౌస్ ఎప్పుడూ వివాదాలకు కేంద్రంగా ఉంటోందన్నారు. ఓసారి పట్టుబడితే దీపావళి ఫెస్ట్ అంటారు... ఇంకోసారి పట్టుబడితే గృహప్రవేశమని చెబుతారని, ప్రతిసారి ఏదో కారణం చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేద్దామనుకుంటే... బీఆర్ఎస్ మాత్రం డ్రగ్స్‌ను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా పక్కదారి పట్టించిందో అందరికీ తెలుసున్నారు.
Advertisement
Congress
Anil Kumar Yadav
Telangana
KTR

More Telugu News