టేలర్ స్విఫ్ట్ పాటల్లో దాగున్న రహస్యం.. 1.23 లక్షల పదాల విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!
- టేలర్ పాటల్లో 1,23,553 పదాలను పరిశీలించిన అధ్యయనం
- మొత్తం 247 పాటలతో ప్రత్యేక డేటాబేస్ రూపకల్పన
- ఆమె పాటల్లో బూడిద రంగు ప్రస్తావన ఎక్కువ
- జరగని సంఘటనలు, అవకాశాలపై తరచూ పాటలు
- శరీర భాగాలు, దుస్తుల ప్రస్తావనకు ప్రత్యేక స్థానం
పాటలు మారినా.. ఆల్బమ్‌లు కొత్తగా వచ్చినా.. టేలర్ స్విఫ్ట్ రాసే పాటల్లో కొన్ని అంశాలు మాత్రం ఎప్పటికీ మారడం లేదట! ఆమె పాటల్లోని 1.23 లక్షల పదాలను విశ్లేషించిన ఓ అధ్యయనం ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రంగుల ప్రస్తావన నుంచి మనుషుల ఆలోచనల వరకు.. ఆమె పాటల్లో పదేపదే కనిపించే అంశాలను పరిశోధకులు గుర్తించారు.
247 పాటలు.. లక్షకు పైగా పదాలు
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పాటల్లో దాగున్న భాషా రహస్యాలను తెలుసుకునేందుకు లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన సాహిత్య భాషాశాస్త్ర పరిశోధకురాలు నవోమి ఆడమ్ ఓ ప్రత్యేక డేటాబేస్ రూపొందించారు. టేలర్ లిరిక్ కార్పస్ (టాలికో)గా పిలిచే ఈ డేటాబేస్‌లో 1,23,553 పదాలు ఉన్నాయి. మొత్తం 247 పాటలను ఇందులో చేర్చారు. ఆమె 12 స్టూడియో ఆల్బమ్‌లతో పాటు ఇతర పాటల సాహిత్యాన్ని కూడా పరిశీలించారు.
బూడిద రంగుకే ఎక్కువ ప్రాధాన్యం
టేలర్ పాటల్లో రంగుల ప్రస్తావన ఆసక్తికరంగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. రెడ్ పేరుతో ప్రత్యేక ఆల్బమ్ ఉన్నప్పటికీ.. ఆమె పాటల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా కనిపించే రంగు బూడిదేనట. పాత పాటల్లోని నీలి ఆకాశం, ముదురు బూడిద రంగు ప్రస్తావనలతో పాటు కొత్త పాటల్లోనూ ఈ ధోరణి కొనసాగుతోందని పరిశోధకురాలు గుర్తించారు.
జరగని విషయాలపైనా ఊహలు
టేలర్ పాటల్లో ‘ఏమై ఉంటే?’ అనే తరహా ఆలోచనలు తరచూ కనిపిస్తుంటాయి. ‘వుడ్’, ‘షుడ్’, ‘కుడ్’ వంటి పదాల వినియోగం ద్వారా జరగని సంఘటనలు, భవిష్యత్తులో జరిగే అవకాశాలపై ఆమె తన పాటల్లో స్పందిస్తుంటారని అధ్యయనం పేర్కొంది. ఇతరులు తనను ఎలా చూస్తారనే కోణం కూడా ఆమె రచనల్లో కనిపిస్తుందని తెలిపింది.
దుస్తులు.. శరీర భాగాల ప్రస్తావన
చేతులు, ముఖం, గుండె, పెదవులు, భుజాలు వంటి శరీర భాగాల ప్రస్తావన టేలర్ పాటల్లో పదేపదే వస్తోంది. దుస్తుల విషయంలోనూ కార్డిగాన్లు, టీషర్టులు, నల్లటి దుస్తుల వంటి వాటికి ఆమె ప్రాధాన్యమిచ్చారు. ఇవి కేవలం వర్ణనలకే పరిమితం కాకుండా.. పాత్రల వ్యక్తిత్వం, భావోద్వేగాలను ప్రతిబింబిస్తున్నాయని ఆడమ్ విశ్లేషించారు.
కొత్త పాటల్లోనూ అదే ధోరణి
ది లైఫ్ ఆఫ్ ఎ షోగర్ల్: ది ఎన్‌కోర్ ఎక్స్ టెండెడ్ ఎడిషన్‌లోని నాలుగు కొత్త పాటల్లోనూ గత రచనల్లో కనిపించిన అంశాలు కొనసాగుతున్నాయని అధ్యయనం తెలిపింది. 2026 సెప్టెంబర్ 25న విడుదలైన ఈ ఎడిషన్‌లో పేషెంట్ జీరో సహా నాలుగు పాటలు ఉన్నాయి. టేలర్ తన సంగీత శైలిని మార్చుకుంటున్నా.. పాటల్లోని కొన్ని ఆలోచనలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.