టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నిందితుడు చైతన్యకు వైద్య పరీక్షలు

CID custody for Panuganti Chaitanya in TDP Office Attack case
షార్ట్స్‌లో చూడండి
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఇటీవల కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చైతన్య ఏ1 నిందితుడిగా ఉన్నాడు. 

చైతన్యను కస్టడీకి అప్పగించాలని ఇటీవల సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మంగళగిరి కోర్టు చైతన్యను మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, చైతన్యను ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 

ఈ క్రమంలో, నేడు చైతన్యకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం అతడిని సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు.
Go Back to Shorts
TDP Office Attack Case
Panuganti Chaitanya
CID Custody
YSRCP

More Telugu News