హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ చివరి క్షణాలు.. వీడియో ఇదిగో!
- ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల సూత్రధారి సిన్వరే
- దాడి చేసి మట్టుబెట్టిన ఇజ్రాయెల్
- డ్రోన్ వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్
- తనను చిత్రీకరిస్తున్న డ్రోన్‌పై వస్తువు విసిరిన సిన్వర్
గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌లో 62 ఏళ్ల సిన్వర్ హతమయ్యాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్).. ‘ఎలిమినేటెడ్: యహ్వా సిన్వర్’ అని రాసుకొచ్చింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి సూత్రధారి సిన్వరేనని, ఐడీఎఫ్ ఆయనను అంతమొందించిందని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి ఇజ్రాయెల్ కత్జ్ పేర్కొన్నారు.