హైద‌రాబాద్‌లో దారుణం.. వృద్ధుడిపై బైక‌ర్‌ విచ‌క్ష‌ణ‌ర‌హిత‌ దాడి.. చికిత్స పొందుతూ మృతి!
Advertisement

హైద‌రాబాద్‌లో దారుణం.. వృద్ధుడిపై బైక‌ర్‌ విచ‌క్ష‌ణ‌ర‌హిత‌ దాడి.. చికిత్స పొందుతూ మృతి!

Elderly Man Asks Biker To Slow Down Dies After Being Thrashed in Hyderabad
  • హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఘ‌ట‌న
  • బైక్‌పై వేగంగా వెళుతున్న వ్య‌క్తిని నెమ్మ‌దిగా వెళ్ల‌మ‌ని చెప్ప‌డ‌మే పొర‌పాటు
  • వృద్ధుడైన ఆంజనేయులుపై భౌతిక దాడికి పాల్ప‌డ్డ బైక‌ర్‌
హైదరాబాద్‌ శివారు అల్వాల్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మోటర్‌బైక్‌పై వేగంగా వెళుతున్న వ్య‌క్తిని ఓ వృద్ధుడు నెమ్మ‌దిగా వెళ్ల‌మ‌ని చెప్పాడు. అంతే.. బైక్‌పై ఉన్న వ్య‌క్తి ఆ వృద్ధుడిపై విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడికి పాల్ప‌డ్డాడు. దాంతో వృద్ధుడి త‌ల‌కు బలమైన గాయాలు కావ‌డంతో గురువారం చ‌నిపోయాడు.

సెప్టెంబరు 30న ఈ సంఘటన జరిగింది. బాధితుడు 65 ఏళ్ల ఆంజనేయులు. ఈ ఘ‌ట‌న తాలూకు సీసీటీవీ ఫుటేజీని తాజాగా పోలీసులు విడుద‌ల చేశారు. వీడియోలో ఆంజ‌నేయులుపై సద‌రు వ్యక్తి భౌతికంగా దాడి చేయ‌డం ఉంది. తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. 

ఆంజ‌నేయులును కాపాడేందుకు కుటుంబ స‌భ్యులు ఎంతగానో ఖ‌ర్చు చేసినా ఫ‌లితం లేకపోయింది. చికిత్స పొందుతూ వృద్ధుడు చ‌నిపోయాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదైంది. 

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 
Advertisement
Hyderabad
Telangana

More Telugu News