Hari Hara Veera Mallu: పవన్‌ కల్యాణ్ సినిమా ప్రమోషన్‌ మొదలుపెట్టారు!

Pawan Kalyan has started the promotion of the movie
షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో ఉన్న పవన్‌కల్యాణ్‌, మరోవైపు తన సినిమాల చిత్రీకరణ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఒకటైన 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' సినిమా షూటింగ్‌లో ఆయన ఇటీవల పాల్గొన్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకుడు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఈ నెల 14న తిరిగి ప్రారంభం కానుందని, నవంబరు 10 వరకు జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని ఇక ఈ చిత్రం నుంచి తొలి లిరికల్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నామని, ఈ గీతాన్ని పవన్‌కల్యాణ్‌ స్వయంగా ఆలపించడం విశేషమని మేకర్స్‌ తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను దసరా సందర్భంగా విడుదల చేసి లిరికల్‌ పాట విడుదల అప్‌డేట్‌ను ఇచ్చారు. 

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ''సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా. పవన్ కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది" అని తెలిపారు. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్‌ విన్నర్‌ ఎం.ఎ.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. 
Go Back to Shorts
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Hari Hara Veera Mallu update
Hari Hara Veera Mallu release date
Pawan kalyan latest movie
Tollywood

More Telugu News