దసరా స్పెష‌ల్‌.. బాల‌య్య‌, బోయ‌పాటి 'బీబీ4'పై కీల‌క అప్‌డేట్‌!

The Sensational Announcement on BB4
  • టాలీవుడ్‌లో బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను కాంబోకు ప్ర‌త్యేక క్రేజ్
  • ఇప్ప‌టికే ఈ కాంబోలో మూడు సినిమాలు
  • మూడు కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచిన వైనం
  • ఇప్పుడు బీబీ4గా మ‌రో మూవీ
  • అక్టోబ‌ర్‌ 16న ఈ సినిమాకు ముహుర్తంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌
టాలీవుడ్‌లో బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను కాంబోకు ప్ర‌త్యేక క్రేజ్ ఉంది. ఈ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన మూడు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ ఇద్దరి కాంబోలో వ‌చ్చిన‌ సింహా, లెజెండ్‌, అఖండ సూప‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి జ‌త క‌డుతున్నారు. 

ఇటీవ‌లే దీనిపై అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇవాళ ద‌స‌రా సంద‌ర్భంగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ బీబీ4 షూటింగ్ అప్డేట్‌ను ఇచ్చింది. మూవీ షూటింగ్ ప్రారంభానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల‌ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభంకానున్నట్లు తెలిపింది. 

"అంద‌రికీ విజయ దశమి శుభాకాంక్షలు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీ4 సెన్సేషనల్ ప్ర‌క‌ట‌న చేస్తున్నాం. ఈ మాసివ్ ఎపిక్ కాంబినేషన్ గ్రాండ్ జర్నీ మొదలు కానుంది. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ముహూర్తం ఖరారు చేశాం" అని త‌న ట్వీట్‌లో 14 రీల్స్ రాసుకొచ్చింది.
Go Back to Shorts
BB4
Balakrishna
Boyapati Sreenu
Tollywood

More Telugu News