కంగనా రనౌత్ పై మీరా చోప్రా ప్రశంసలు

Kangana Ranaut is a warrior says Meera Chopra
  • కంగనా రనౌత్ ఒక పోరాట యోధురాలు అన్న మీరా చోప్రా
  • ఎన్నో సమస్యలను ఒంటరిగా ఎదుర్కొన్నారని కితాబు
  • గొప్ప రాజకీయవేత్త అవుతారని ధీమా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై నటి మీరా చోప్రా ప్రశంసలు కురిపించారు. కంగన ఒక పోరాట యోధురాలని ఆమె ప్రశంసించారు. సినీ పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కంగన... ఇప్పుడు రాజకీయరంగంలో కూడా రాణిస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో కంగన ఎన్నో విజయాలు సాధించారని, ఎన్నో సమస్యలను ఒంటరిగా ఎదుర్కొన్నారని తెలిపారు. 

రాజకీయాల్లోకి వెళ్లాలనే నిర్ణయాన్ని కంగన సరైన సమయంలో తీసుకున్నారని, తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారని మీరా చోప్రా చెప్పారు. రాజకీయాల్లో కూడా కంగన తనదైన మార్క్ ను చూపుతారని అన్నారు. ఇబ్బందులు వస్తాయని తెలిసినా తల వంచని మనస్తత్వం కంగనదని కొనియాడారు. ఏ విషయం గురించి అయినా మనసులో మాటను ధైర్యంగా చెపుతారని అన్నారు. భవిష్యత్తులో ఆమె గొప్ప రాజకీయవేత్త అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Meera Chopra
Kangana Ranaut
Bollywood
BJP

More Telugu News