Advertisement

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ఏపీ మంత్రి నారా లోకేశ్

AP minister Nara Lokesh will tour in USA from Oct 25
  • అక్టోబరు 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికాలో లోకేశ్ పర్యటన
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ 
  • హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్
  • ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటన
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. నారా లోకేశ్ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా, ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ సమావేశం కానున్నారు. 

ఏపీలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోగతికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో లోకేశ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ పర్యటన కొనసాగనుంది.
Advertisement
Nara Lokesh
USA
IT Conference
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News