Allu Arjun: రాజేంద్రపసాద్‌ ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్‌

Allu Arjun is the hero who dared to go home to Rajendra Pasad
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో త్రీవ విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి (38) ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. కూతురు మరణంతో రాజేంద్రప్రసాద్ తీవ్ర విషాదంలో వున్నారు... ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇప్పటికే పలువురు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు రాజేంద్రప్రసాద్ కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మరణం తమను ఎంతో కలిచి వేసిందని, ఈ బాధ నుండి ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు.  

ఇక రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనను షాకింగ్‌కు గురిచేసిందని అల్లు అర్జున్ స్పందించారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

తనకు నటుడిగా, వ్యక్తిగా ఎంతో ఆప్తులైన, అత్యంత ఇష్టుడైన రాజేంద్రప్రసాద్ గారికి ఇలాంటి కష్టం రావడం దురదృష్టకరమని, గాయత్రి మరణం చాలా విషాదకరమని అల్లు అర్జున్ తెలిపారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి అల్లు అర్జున్‌, జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాలలో కలిసి నటించారు.
Go Back to Shorts
Allu Arjun
Rajendra prasad
gayathri

More Telugu News