ఐదేళ్ల తర్వాత ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ... శత్రువులను ఓడిస్తామని ప్రతిన
- టెహ్రాన్‌లో నిర్వహించిన నస్రల్లా సంస్మరణ సభలో పాల్గొన్న ఖమేనీ
- నస్రల్లా మృతి తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన
- హమాస్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదని ధీమా
ఇజ్రాయెల్‌పై మిసైల్ దాడులను సమర్థించుకున్న ఆయన... ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ప్రకటించారు. శత్రువుల పప్పులు ఉడకనివ్వబోమని ప్రతినబూనారు.
నస్రల్లా మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. హమాస్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు. నస్రల్లా మనమధ్య లేనప్పటికీ ఆయన మార్గం మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. శత్రువులకు వ్యతిరేకంగా మనమందరం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.