Jr NTR: నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR responds on Devara release moments
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దేవర చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దేవర మేనియా నెలకొంది. ఈ నేపథ్యంలో, జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో భావోద్వేగభరితంగా స్పందించారు. 

"నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మీ అద్భుతమైన స్పందన చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. థాంక్యూ కొరటాల శివ గారూ... దేవర చిత్రాన్ని ఎంతో రసవత్తరంగా, భావోద్వేగాల అనుభూతిని కలిగించేలా తెరకెక్కించారు. తమ్ముడూ అనిరుధ్... నీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దేవర చిత్రానికి జీవం పోశావు. 

దేవర చిత్రానికి బలమైన మూలస్తంభాల్లా నిలిచి నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కెమెరామన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం అమోఘమైన రీతిలో కృషి చేసిన ప్రతి టెక్నీషియన్ కు కృతజ్ఞతలు. 

నా అభిమానులూ... మీ సంబరాలు చూశాక నాకెంతో ఆనందం కలిగింది. మీరు చూపించే ప్రేమకు సదా రుణపడి ఉంటాను. ఈ సినిమాను నేను ఎంత ఆస్వాదించానో, మీరు కూడా అదే రీతిలో ఆస్వాదిస్తుండడం హర్షణీయం. మిమ్మల్ని ఎప్పటికీ ఇదే విధంగా అలరిస్తుంటానని హామీ ఇస్తున్నాను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Jr NTR
Devara
Grand Release
Tollywood

More Telugu News