చిరంజీవి ఆ సినిమా కోసం చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు: ఏడిద శ్రీరామ్

చిరంజీవి ఆ సినిమా కోసం చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు: ఏడిద శ్రీరామ్

Edida Sri Ram Interview
  • విశ్వనాథ్ గారు అంటే నాన్నగారికి నమ్మకం 
  • ఆ కథలను పెద్ద నిర్మాతలు తిరస్కరించారన్న శ్రీరామ్ 
  • చిరంజీవికి ఆ కథ చెప్పడానికి విశ్వనాథ్ ఆలోచించారని వెల్లడి 
  • వినగానే చిరంజీవి ఒప్పుకున్నారని వివరణ       

తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు అనిపించే సినిమాల జాబితాలో, పూర్ణోదయా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు కనిపిస్తాయి. దర్శకుడు కె విశ్వనాథ్ .. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలిసి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారీ విజయాలను తీసుకొచ్చాయి. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను గురించి, తాజాగా 'ఐడ్రీమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏడిద శ్రీరామ్ మాట్లాడారు. 

'సిరిసిరిమువ్వ' .. 'శంకరాభరణం' .. 'స్వాతిముత్యం' ఈ సినిమాల కథలను ముందుగా విశ్వనాథ్ గారు చాలామంది పెద్ద నిర్మాతలకు వినిపించారట. వాళ్లెవరూ ఆ కథలను సినిమాగా తీయడానికి ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని విశ్వనాథ్ గారే స్వయంగా చెప్పేవారు. ఆ విషయం చెప్పిన తరువాతనే, ఆ కథలను ఆయన నాన్నగారికి వినిపించారు. ఆ కథలపై .. విశ్వనాథ్ గారిపై గల నమ్మకంతో నాన్నగారు ఒప్పుకున్నారు .. అలా అవి క్లాసికల్ అనిపించుకున్నాయి" అన్నారు. 

'స్వయంకృషి' సినిమా సమయానికి చిరంజీవిగారు సుప్రీమ్ హీరో. ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్. అలాంటి ఆయనను కలిసి ఆ కథను చెప్పడానికి నాన్నగారు - విశ్వనాథ్ గారు కలిసి చాలా ఆలోచించారు. ఒప్పుకుంటారో లేదోనని సందేహం. కానీ కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. చెప్పులు కుట్టే అతణ్ణి ఇంటికి పిలిపించుకుని, చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు. ఆ సినిమా ఆయనకి నంది అవార్డును తెచ్చిపెట్టింది" అని చెప్పారు.

Advertisement
Chiranjeevi
K Vishwanath
Swayamkrushi

More Telugu News