Satya Kumar Yadav: ఇదీ ధర్మవరం కేటురెడ్డి నిజస్వరూపం: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకున్నారు. ఇదీ ధర్మవరం కేటురెడ్డి నిజస్వరూపం అంటూ ట్వీట్ చేశారు. ఓటమితో మైండ్ బ్లాంక్ అయ్యి, ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయిన వైనం అని వివరించారు. గతంలో చేసిన తప్పులకు, కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాణం నేర్పినా బుద్ధిరాలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తాం... కానీ ధర్మవరం ప్రజలకు చిన్న కీడు తలపెట్టినా సహించబోమని హెచ్చరించారు. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.
జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తాం... కానీ ధర్మవరం ప్రజలకు చిన్న కీడు తలపెట్టినా సహించబోమని హెచ్చరించారు. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ ధర్మవరం కేటురెడ్డి నిజస్వరూపం. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయిన వైనం. గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తాం. కానీ ధర్మవరం ప్రజలకు… pic.twitter.com/dwIL2BXPta
— Satya Kumar Yadav (@satyakumar_y) September 23, 2024