Aishwarya Rajesh: ఆ సినిమాతో మా ఆస్తులన్నీ పోయాయి: ఐశ్వర్య రాజేశ్ తల్లి నాగమణి

Nagamani Rajesh Interview
షార్ట్స్‌లో చూడండి
ఐశ్వర్య రాజేశ్ .. 'మల్లెమొగ్గలు' హీరో రాజేశ్ కూతురు. నటి శ్రీలక్ష్మికి మేనకోడలు అనే విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ తల్లి నాగమణి 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "రాజేశ్ సినిమాల్లోకి రావడానికి .. హీరో కావడానికి పెద్దగా కష్టపడలేదు. జంధ్యాల గారి సినిమాల్లో ఆయన ఎక్కువగా చేశారు. అవి మంచి విజయాలను సాధించాయి" అని చెప్పారు. 

రాజేశ్ కి స్నేహితులు ఎక్కువ .. ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేసేవారు. అలా ఆయన 'అలజడి' అనే సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన .. మరో నిర్మాత మాట తప్పడం వలన నష్టాలు వచ్చాయి. అప్పటివరకూ ఆయన కష్టపడి సంపాదించినది మొత్తం ఆ సినిమాతో పోయింది. ఆ బాధ నుంచి తట్టుకోవడం ఆయనకి చాలా కష్టమైంది. ఆ తరువాత పచ్చకామెర్లు రావడంతో ఆయన మరణించారు" అని అన్నారు.

"తండ్రి చనిపోయే సమయానికి ఐశ్వర్య రాజేశ్ కి ఎనిమిదేళ్లు. ఆమె ఎప్పుడూ సినిమాల గురించిన ఆలోచన చేయలేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని అనుకునేది. కానీ అనుకోకుండానే వచ్చిన అవకాశాలు ఆమెను మంచి పొజీషన్ లోకి తీసుకుని వెళ్లాయి. ఎక్కువగా మేకప్ చేయకపోవడం.. సహజంగా నటించడం ఆమెకి ప్లస్ అయ్యాయని నేను నమ్ముతాను" అని అన్నారు. 

Go Back to Shorts
Aishwarya Rajesh
Rajesh
Nagamani

More Telugu News