Advertisement

'కల్కి' రికార్డు బ్రేక్... విడుద‌ల‌కు ముందే బాలీవుడ్ మూవీకి య‌మా క్రేజ్!

Stree 2 advance booking beat Kalki and Fighter on Day 1
  • రిలీజ్ కు ముందే శ్రద్ధా కపూర్ సినిమాకు భారీ క్రేజ్
  • బాలీవుడ్ లో 'ఫైటర్‌', 'కల్కి' అడ్వాన్స్‌ బుకింగ్స్‌ల కలెక్షన్లను దాటేసిన 'స్త్రీ- 2'  
  • ఆగస్టు 15న విడుదల కానున్న చిత్రం
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్ రావు జంట‌గా నటించిన సినిమా 'స్త్రీ- 2'. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తాజాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'స్త్రీ- 2' బాలీవుడ్ లో 'ఫైటర్‌', 'కల్కి' అడ్వాన్స్‌ బుకింగ్స్‌ల కలెక్షన్లను దాటేసింది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వచ్చినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. 

ఈ చిత్రానికి సంబంధించి సోమవారం ఉదయం 9 గంటల సమయానికి 1.2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయినట్లు వాణిజ్య వెబ్‌సైట్ 'సక్‌నిల్క్' తెలిపింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఫస్ట్ డే కలెక్షన్లు రూ. 30 కోట్ల వ‌ర‌కు నమోదు చేసినా ఆశ్చర్యపోనవసరం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అటు బాలీవుడ్‌లో ఆగస్టు 15న విడుదల కానున్న 'ఖేల్ ఖేల్ మేస‌, 'వేద' చిత్రాలతో పోల్చితే అడ్వాన్స్ బుకింగ్స్ 'స్త్రీ- 2'కే ఎక్కువ రావడం విశేషం.

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం...  హిందీలో రూ. 22.5 కోట్లు వసూలు చేసిన 'ఫైటర్, 'కల్కి 2898 ఏడీ' మొదటి రోజు వ‌సూళ్ల‌ను అధిగమిస్తే... ఈ ఏడాదిలో అతిపెద్ద బాలీవుడ్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉంది.

కాగా, డైరెక్టర్ అమర్ కౌశిక్‌ కామెడీ, హారర్ జానర్ లో ఈ మూవీ తెరకెక్కించారు. ఇక రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.
Advertisement
Stree 2
Kalki
Fighter
Bollywood

More Telugu News