K Kavitha: సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత

Kavitha files bail petition in SC
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై అగస్ట్ 12న విచారణ జరగనుంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ సోమవారానికి లిస్ట్ అయింది.

న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇదివరకు నిరాకరించాయి. ఢిల్లీ హైకోర్టు జులై 1న ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

కవితను మద్యం పాలసీ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు కింది కోర్టులు బెయిల్‌ను తిరస్కరించాయి. దాదాపు ఐదు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News