రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు
- రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య
- రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
- ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన రాజ్ తరుణ్
దాంతో, తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.
పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, అనేక ఏళ్లుగా తాము సహజీవనంలో ఉన్నామని, ఇటీవల హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడ్డాడని లావణ్య మీడియా ఎదుట వెల్లడించిన సంగతి తెలిసిందే.