Rahul Gandhi: రాహుల్ గాంధీకి కొత్త బంగ్లాను ఆఫర్ చేసిన లోక్ సభ హౌస్ కమిటీ

Lok Sabha House Committee offers Rahul Gandhi new residence
షార్ట్స్‌లో చూడండి
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించనుంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ ఆయనకు ఆఫర్ చేసినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీ ఈ భవనాన్ని చూసేందుకు వచ్చారు. దీంతో ఆయనకు ఈ భవనం కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఇంటికి సంబంధించి రాహుల్ గాంధీ నుంచి సమాధానం రావాల్సి ఉందని తెలుస్తోంది.

లోక్ సభలో ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి కేబినెట్ ర్యాంక్ కలిగి ఉన్నారు. ఆయన టైప్ 8 బంగ్లాకు అర్హులు. టైప్ 8 బంగ్లాను కేబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
BJP

More Telugu News