Purushothamudu: భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు'

Raj Tarun Purushothamudu released in Theaters
షార్ట్స్‌లో చూడండి
టాలెంట్ పరంగా ఎలాంటి మైనస్ లు లేని నటుడు రాజ్ తరుణ్. కెరీర్ ఆరంభంలో వరుస హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ యువ హీరో కొద్దిగా గ్యాప్ తీసుకుని నటించిన చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి డాక్టర్ రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మాతలు. 

ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ వంటి అగ్రశ్రేణి నటులు కీలకపాత్రలు పోషించారు. పురుషోత్తముడు చిత్రం విడుదలకు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది. అందుకు కారణం టీజర్, ట్రైలర్ లో ఉన్న కంటెంటే. 

చిత్ర నిర్మాతలు రమేశ్, ప్రకాశ్ ప్రమోషన్స్ బాగా శ్రద్ధ చూపడంతో  ఆడియన్స్ లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అనుకున్నట్టుగానే ఇవాళ (జులై 26) థియేటర్లలో రిలీజైన పురుషోత్తముడు చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా ప్రథమార్థంలో ఎంటర్టయిన్ మెంట్ కు లోటు ఉండదు. సెకండాఫ్ లో డ్రామాకు పెద్దపీట వేశారు. 

గోపీసుందర్ సంగీతం పురుషోత్తముడు చిత్రానికి ప్లస్ అయింది. విలువల పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదన్న విషయం సినిమా క్వాలిటీయే చెబుతుంది. కథ పాతదే అయినా, కథనం పరంగా కొత్తదనం తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. 

హీరో-హీరోయిన్ పరిచయం, లవ్ ఎపిసోడ్ ప్రేక్షకులకు వినోదాన్నందిస్తుంది. పీజీ విందా కెమెరా పనితనం ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
Go Back to Shorts
Purushothamudu
Raj Tarun
Ram Bheemana
Release

More Telugu News