Jagan: ప్రసంగం మధ్యలో విలేకరి అడిగిన ప్రశ్నతో టాపిక్ మర్చిపోయిన జగన్... వీడియో ఇదిగో!

Jagan distrurbed with a question amidst his press meet
  • నేడు వినుకొండ వచ్చిన జగన్
  • హత్యకు గురైన రషీద్ కుటుంబానికి పరామర్శ
  • ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా, విలేకరి మధ్యలో ప్రశ్నించడంతో చిరాకు
  • ఏం మాట్లాడాలో తెలియక బుర్ర గోక్కున్న వైనం
  • సబ్జెక్టు గుర్తు చేసిన అంబటి రాంబాబు, తదితరులు
ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ వినుకొండలో ప్రసంగిస్తుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన రషీద్ విషయాన్ని ఏపీ శాంతి భద్రతలతో ముడిపెడుతూ, ఓ పద్ధతి ప్రకారం జగన్ తన ప్రసంగం కొనసాగిస్తుండగా, మధ్యలో ఓ పాత్రికేయుడు (ఆంధ్రజ్యోతి) ప్రసంగం ముగిసిందనుకుని ఓ ప్రశ్న వదిలాడు. 

దాంతో జగన్ ప్రశ్న అడిగిన ఆ విలేకరిపై చిరాకుపడ్డారు. ఆగబ్బా... చెప్పేటప్పుడు మధ్యలో వస్తే ఫ్లో దెబ్బతింటుంది కదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

కొంచెం ఆగు... ప్రసంగం అయిపోయిన తర్వాత అడుగు... అని ఆ విలేకరికి చెప్పిన జగన్... తన ప్రసంగం కొనసాగించే ప్రయత్నం చేసి, ఏమీ గుర్తుకురాక ఇబ్బందిపడ్డారు. ఏం చెబుతున్నాను ఇప్పుడు... అంటూ బుర్ర గోక్కున్నారు. దాంతో పక్కనున్న అంబటి రాంబాబు తదితరులు సబ్జెక్టును గుర్తు చేయడంతో జగన్ మళ్లీ ప్రసంగం కొనసాగించారు. 

దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని ఎక్స్ లో పంచుకుంది.
Jagan
Press Meet
Vinukonda
Rasheed
Murder
YSRCP
TDP

More Telugu News