ఆస్ట్రేలియాలో ఘనంగా టీడీపీ విజయోత్సవాలు... హాజరైన నటుడు శివాజీ
- సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం
- ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్న మెల్బోర్న్ టీడీపీ కమిటీ
- 1,100 మంది టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల హాజరు
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. దాదాపు 1,100 మంది టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఈ విజయోత్సవ సంబరాలకు హాజరై జయప్రదం చేశారు.
తెలుగుదేశం మెల్ బోర్న్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సభను ఘనంగా నిర్వహించారు. మెల్ బోర్న్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.
