బీజేపీ పొలిటికల్ గేమ్... విభజన సమస్యల పేరుతో చంద్రబాబు ఎంటర్ అయ్యారు: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్య
- ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్‌ను తెలంగాణలో ఆడాలని బీజేపీ భావిస్తోందని వ్యాఖ్య
- చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
- టీడీపీ, జనసేన పేరుతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం
తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందని... టీడీపీని ముందుబెట్టి గేమ్ ఆడుతోందన్నారు. తెలంగాణను కూడా బీజేపీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో అడుగుపెట్టి... రెండు కళ్ల సిద్ధాంతం రాజకీయాన్ని మొదలు పెట్టారన్నారు. తమ పార్టీని తెలంగాణలో దెబ్బతీసేందుకే టీడీపీ, జనసేనలను బీజేపీ రంగంలోకి దించిందన్నారు. వివిధ కేసుల్లో ఉన్నవారు బీజేపీలో చేరారని విమర్శించారు.