నాన్నా.. ఈరోజు మా అందరికీ పండుగ రోజు: జగన్

YS Jagan emotional tweet on his father YSR birthday
  • తండ్రి వైఎస్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ట్వీట్
  • కోట్లాది కుటుంబాలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయన్న జగన్
  • మీ ఆశయాల సాధనే తమ లక్ష్యమన్న మాజీ సీఎం
తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. 'నాన్నా.. మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి' అని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు ఇడుపులపాయలోని వైస్ ఘాట్ వద్ద తన భార్య భారతితో కలిసి జగన్ నివాళి అర్పించారు. భర్త, కొడుకు, కోడలు, కూతురుతో కలిసి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళి అర్పించారు. జగన్, షర్మిల ఇద్దరూ విడివిడిగా తమ త్రండికి నివాళి అర్పించి, ప్రార్థనలు నిర్వహించారు.
Go Back to Shorts
YS Jagan
YSRCP
YS Rajasekhar Reddy

More Telugu News