మదుపరుల లాభాల స్వీకరణ... ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్
- ఫ్లాట్ గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- ట్రేడింగ్ ప్రారంభంలో సరికొత్త గరిష్ఠాల నమోదు
- క్రమంగా నెమ్మదించిన సూచీలు
ఉదయం సెషన్ లో సెన్సెక్స్ 80,392 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. అక్కడ్నించి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఫ్లాట్ గా ముగిసింది. నిఫ్టీలోనూ ఇదే ఒరవడి కనిపించింది. అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ కూడా లాభాలతోనే ముగిశాయి.
ఇవాళ్టి ట్రేడింగ్ లో సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు లాభాలు అందుకోగా... ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.