విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan attends Ramoji Rao memorial service in Vijayawada
  • ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన రామోజీరావు
  • ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు విజయవాడలో సంస్మరణ సభ
  • సతీసమేతంగా హాజరైన చంద్రబాబు
  • కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రులు లోకేశ్, నాదెండ్ల, పార్థసారథి, సత్యకుమార్
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్నిరోజుల కిందట తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం నేడు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. 

ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రస్థానం ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు. వారాహి మాత దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో రాగా, వారికి ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్వాగతం పలికారు. ఏపీ మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ కూడా రామోజీ సంస్మరణకు వచ్చారు. ఆ పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులు అర్పించారు  సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Advertisement
Ramoji Rao
Memorial Service
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh
TDP-JanaSena-BJP Alliance
Vijayawada

More Telugu News