మత్స్యకారుడి వేషధారణలో అసెంబ్లీకి జనసేన ఎమ్మెల్యే.. అసలు కారణం ఇదేనట.. వీడియో ఇదిగో!
- నరసాపురం నుంచి విజయం సాధించిన నారాయణ నాయకర్
- చేపల వల, బుట్టతో అసెంబ్లీకి ఎమ్మెల్యే
- వచ్చే ఐదేళ్లు మత్స్యకారులకు అండగా ఉంటానని చెప్పేందుకే ఈ వేషధారణ అని వివరణ
జాలరి వేషధారణలో వచ్చిన ఆయనను తొలుత ఎవరూ గుర్తించలేదు. చేతిలో వల, చేపలబుట్ట పట్టుకుని అసెంబ్లీ గేటు వరకు నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఎమ్మెల్యే అని గుర్తించిన తర్వాత ఆయన వేషధారణ వెనకున్న కారణాన్ని విలేకరులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో 970 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, అయినప్పటికీ మత్స్యకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఐదేళ్లు వారికి అండగా ఉంటానని చెప్పేందుకే ఈ వేషధారణలో వచ్చినట్టు నాయకర్ వివరించారు.