Pawan Kalyan: నిధుల మళ్లింపుపై అధికారులను నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అసెంబ్లీ కమిటీ హాల్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ 15వ ఆర్థిక సంఘం నిధుల ప్రస్తావన తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎన్ని నిధులు మళ్లించారో తనకు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థల నిధులు ఎన్ని మళ్లించారో నివేదించాలని స్పష్టం చేశారు.
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధికారులతో చర్చించారు. విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో డయేరియా ప్రబలడం పట్ల పవన్ సమీక్షించారు.
విజయవాడలో తాగునీటి సరఫరాలో లోపాలే డయేరియాకు దారితీసినట్టు పవన్ అభిప్రాయపడ్డారు. సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.