ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు పోలీసుల గౌరవ వందనం

AP Deputy CM Pawan Kalyan Vijayawada Tour
  • విజయవాడలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం
  • జలవనరుల శాఖ అతిథిగృహంలో పవన్ కు అధికారుల స్వాగతం
  • సచివాలయంలో తన పేషీని పరిశీలిస్తారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. పవన్ కల్యాణ్ విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగిన పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా జలవనరుల శాఖ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడి అధికారులు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. విజయవాడలో తనకోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు కార్యాలయాన్ని పవన్ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించి, అవసరమైన మార్పులు సూచించారు.

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్యాంపు కార్యాలయం భవనాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. బిల్డింగ్ పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆఫీస్ పక్కనే సమావేశ మందిరం ఉండడంతో పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆపై పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా జనసేన కార్యాలయం చేరుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయంకు వెళతారని, అక్కడ తన పేషీని పరిశీలిస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.



Advertisement
Pawan Kalyan
AP DY CM
Vijayawada
Camp Office
AP Secretariat

More Telugu News