ట్రైనీ ఐఏఎస్ గా వచ్చిన కుమార్తె ఉమాహారతికి సెల్యూట్ చేసిన పోలీసు ఉన్నతాధికారి వెంకటేశ్వర్లు
- 2022 సివిల్స్ లో మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి
- ట్రైనీ ఐఏఎస్ గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చిన ఉమాహారతి
- కుమార్తెను చూసి గర్వంతో ఉప్పొంగిపోయిన ఎస్పీ ర్యాంక్ అధికారి వెంకటేశ్వర్లు
తాజాగా, ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్ గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు గర్వించారు. హృదయం ఉప్పొంగిపోగా, ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేశారు. కుమార్తెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
