చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రఘునందన్ రావు శుభాకాంక్షలు

Raghunandan Rao congratulates Chandrababu and Pawan Kalyan
  • ఏపీని కొత్త శిఖరాలకు చేరుస్తారని ఆకాంక్షిస్తున్నానని వ్యాఖ్య
  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన రఘునందన్ రావు
  • చంద్రబాబు, జనసేనానిలకు శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో... చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఆంధ్రప్రదేశ్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత, మెదక్ నుంచి లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘునందన్ రావు ఆకాంక్షించారు. ఈరోజు చంద్రబాబు ఏపీ సీఎంగా, పవన్ కల్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రఘునందన్ రావు ఎక్స్ వేదికగా వారికి శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రిగా ప్రమాణం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Raghunandan Rao
BJP
Chandrababu
Pawan Kalyan
Narendra Modi

More Telugu News