మా సమాచారం తెలుసుకురమ్మని అతనిని పోలీసులే అడవుల్లోకి పంపారు: మావోయిస్టుల వివరణ
- లేఖ విడుదల చేసిన మావోయిస్టు కార్యదర్శి శాంత
- బూబీ ట్రాప్ తొక్కడంతో ప్రాణాలు కోల్పోయిన ఏసు
- ఆదివాసీలు తిరిగే ప్రాంతాల్లో మందుపాతర అమర్చలేదని వివరణ
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, అమాయక ఆదివాసీలను పోలీసులు చంపేస్తున్నారని శాంత ఆరోపించారు. ఇందులో భాగంగానే మావోయిస్టుల సమాచారం తెలుసుకురావాలని ఏసును పోలీసులే అడవుల్లోకి పంపారని ఆరోపించారు. ఆదివాసీలు తిరిగే ఏరియాలలో తాము మందుపాతరలను అమర్చలేదని స్పష్టం చేశారు. కర్రిగుట్టపై బూబీ ట్రాప్ లను అమర్చిన విషయం నిజమేనని, అయితే, ఆ విషయం చుట్టుపక్కల నివసిస్తున్న ఆదివాసీలకు తెలియజేశామని పేర్కొన్నారు. ఆ గుట్టవైపుగా వెళ్లొద్దని అందరినీ హెచ్చరించినట్లు తెలిపారు. అయితే, పోలీసుల ఒత్తిడి కారణంగా ఇల్లందుల ఏసు బలవంతంగా ఆ గుట్టపైకి వెళ్లి ట్రాప్ లో ఇరుకున్నాడని, బాంబు పేలడంతో ప్రాణాలు కోల్పోయాడని మావోయిస్టులు చెప్పారు. ఏసు మృతికి పోలీసులే బాధ్యత వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.