MK Stalin: చంద్ర‌బాబును క‌లిసిన స్టాలిన్‌

MK Stalin Meet Chandrababu Naidu
షార్ట్స్‌లో చూడండి
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ బుధ‌వారం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించినందుకు బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. "ఢిల్లీ విమానాశ్ర‌యంలో త‌లైవ‌ర్ క‌లైంగ‌ర్ కరుణానిధికి చిర‌కాల మిత్రుడు చంద్ర‌బాబును క‌లిశాను. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం. కేంద్రంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. ద‌క్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మ‌న హ‌క్కుల‌ను కాపాడ‌తార‌ని విశ్వ‌సిస్తున్నా" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇండియా కూటమి స‌మావేశం కోసం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. అలాగే చంద్ర‌బాబు కూడా ఎన్‌డీఏ మిత్ర‌ప‌క్షాల భేటీ కోసం ఢిల్లీ వెళ్ల‌డం జ‌రిగింది.
Go Back to Shorts
MK Stalin
Chandrababu Naidu

More Telugu News