ముద్రగడకు ఘనంగా నామకరణ మహోత్సవం.. వీడియో ఇదిగో!
- ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
- పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం
- ఫొటో పెట్టి నామకరణ మహోత్సవం నిర్వహించిన నెటిజన్లు
మరోవైపు, 175కి 175 స్థానాల్లో పోటీచేసిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత ముద్రగడ సోషల్ మీడియాకు లక్ష్యంగా మారారు.
మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ముద్రగడను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయనకు నామకరణ మహోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముద్రగడ ఫొటో ముందు అరటిపండ్లు, కేక్ ఉంచి పద్మనాభరెడ్డి అంటూ మూడుసార్లు ఫొటోలోని చెవి వద్ద ఊది కొత్త పేరు పెట్టారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపైనా సెటైర్లు పేలుతున్నాయి.